శ్రీసింహా ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ఉస్తాద్. బలగం ఫేమ్ కావ్య కళ్యాణ్ రామ్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాను వారాహి చలనచిత్రం, క్రిషి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు నిర్మిస్తున్నారు. ఇన్స్పైరింగ్ అండ్ థ్రిల్లింగ్ స్టోరీతో తెరకెక్కుతున్న ఈసినిమాకు ఫణిదీప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటుంది. సాధారణ మిడిల్ క్లాస్ అబ్బాయి, తన కన్న కల కోసం అటు ప్రేమ కోసం ఫైట్ చేసే క్రమంలో అతని జీవితంలో ఎదురైన సంఘటనలే ఉస్తాద్. బైక్ డ్రైవింగ్ అంటే ఇష్టమున్న హీరోకు విమానం నడపాలనేది ఫ్యాషన్. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి విమానం నడిపేందుకు అతని ప్రయాణం, ప్రేమ, ఆ గమ్యంలో తనకు ఎదురయ్యే సన్నివేశాలను ట్రైలర్ లో చూపించారు. మొత్తంగా ట్రైలర్ చూస్తుంటే, ఇన్స్పైరింగ్ అండ్ థ్రిల్లింగ్ స్టోరీతో ఉస్తాద్ రాబోతుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి అకీవా సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీ్ట్ చేసుకున్న ఈ సినిమాను ఆగస్టు 12న రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.