అగ్రరాజ్యం అమెరికాలో పర్యాటక వీసా పొందాలంటే కనీసం 400 రోజులు వేచి చూడాల్సి వస్తోంది. అందుకే అక్కడికి వెళ్లేందుకు ఇతర దేశాల పర్యాటకులు చాలామంది వెనుకాడుగు వేస్తున్నారు. మరోవైపు యురోపియన్ యూనియన్, బ్రిటన్ దేశాలు పర్యాటకుల సంఖ్యను పెంచేందుకు దూకుడు ప్రదర్శిస్తున్నాయి. దాంతో దేశ పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసే అంశంపై అగ్రరాజ్యం దృష్టి సారించింది. దీనిలో భాగంగా వీసా మంజూరు సమయాన్ని తగ్గించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించిందని తెలుస్తోంది. యూరోపియన్ దేశాలు పర్యాటకుల సంఖ్యను పెంచుకునేందుకు వీసా నుంచి మినహాయింపు కూడా ఇస్తున్నాయి. ఈ తరుణంలో వీసా మంజూరు సమయం తగ్గించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. ముఖ్యంగా భారత్ నుంచి అమెరికాకు ఎక్కవ మంది వెళ్లే అవకాశం ఉన్నందున వారికి టూరిస్ట్ వీసా సమయం తగ్గించి, త్వరగా వీసా మంజూరు చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు సమాచారం.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)