Namaste NRI

ఉత్కంఠ రేకెత్తిస్తున్న కేప్టెన్‌ మిల్లర్‌ టీజర్‌  

ధనుష్ హీరోగా నటిస్తున్న చిత్రం   కెప్టెన్ మిల్లర్. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం.  2023లో అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ పీరియాడికల్ ఫిల్మ్ 1930-40ల నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని టి.జి. త్యాగరాజన్ సత్యజ్యోతి ఫిల్మ్స్, సెంధిల్ త్యాగరాజన్ ,అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. జి. శరవణన్, సాయి సిద్ధార్థ్‌ సహా నిర్మాతలు.ధనుష్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర నిర్మాతలు టీజర్‌ను విడుదల చేశారు. హైదరాబాద్‌లోని ఏఏఏ సినిమాస్‌లో జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్ కి హీరో సందీప్ కిషన్‌తో పాటు అభిమానులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సందీప్‌ కిషన్‌ మాట్లాడుతూ టీజర్‌ లాంచ్‌ హైదరాబాద్‌లో మాత్రమే జరుగుతోంది. ఇది నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. టీజర్ విషయానికి వస్తే, డకాయిట్, హంతకుడుగా ముద్రపడిన కెప్టెన్ మిల్లర్‌ను పట్టుకోవడానికి ప్రకటించిన భారీ రివార్డ్ నోట్ తో ఆసక్తికరంగా టీజర్ ప్రారంభమవుతుంది. ఇతర ప్రముఖ పాత్రలను పరిచయం చేసిన తర్వాత, పెద్ద యుద్ధంలో ఉన్న కెప్టెన్ మిల్లర్ ఆగ్రహాన్ని టీజర్ చూపిస్తుంది. ధనుష్, ఇతర తారాగణం నటించిన బ్రీత్ టేకింగ్ యాక్షన్ సన్నివేశాల అత్యద్భుతంగా వున్నాయి.ధనుష్ బ్రిలియంట్ పెర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. అతని స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉంది. ఈ టీజర్‌లో ప్రియాంక మోహన్, సందీప్ కిషన్, డాక్టర్ శివ రాజ్‌కుమార్‌లు కూడా పరిచయం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ధనుష్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం. 

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events