Namaste NRI

మాధవే మధుసూదనా సక్సెస్‌ కావాలి : మంచు విష్ణు

తేజ్‌ బొమ్మదేవర, రిషిక లోక్రే జంటగా నటిస్తున్న చిత్రం మాధవే మధుసూదనా. బొమ్మదేవర రామచంద్రరావు స్వీయ దర్శకత్వం.  ఈ చిత్రం టీజర్‌ను  నటుడు, మా అసోసియేషన్‌ అధ్యక్షుడు మంచు విష్ణు విడుదల చేశారు. ఈ సందర్భంగా విష్ణు  మాట్లాడుతూ  సినీ పరిశ్రమలో ఓ యాక్టర్‌కి, మేకప్‌ మేన్‌కి వున్న బంధం భార్యభర్తల్లాంటిది. నేను చిన్నప్పటి నుంచి చంద్రను చూస్తున్నాను. దర్శకుడిగా, నిర్మాతగా సినిమా చేయడం అంత సామాన్యమైన విషయం కాదు. ఈ సినిమా సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నాను అన్నారు. దర్శక నిర్మాత మాట్లాడుతూ  ఓ అమ్మాయి అబ్బాయి మనస్ఫూరిగా ప్రేమించుకుంటారు. వారి మధ్య అంతరాలు వారి ప్రేమకు ఎలా అడ్డంకిగా ఎలా మారాయి? దాన్ని వారెలా దాటి ముందుకెళ్లారు. వారి ప్రేమ సక్సెస్‌ ఎలా అయ్యింది అనేది ఈ చిత్ర కథ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్రబృందంతో పాటు పలువురు అతిథులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events