Namaste NRI

ఒహాయో వ్యాలీ తానా టి7 క్రికెట్‌ టోర్నమెంట్‌ మరియు టి5 ఉమెన్స్ క్రికెట్ టోర్నమెంట్

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో ఒహాయో వ్యాలీ టి7 క్రికెట్‌ టోర్నమెంట్‌ మరియు టి5 ఉమెన్స్ క్రికెట్ టోర్నమెంట్ ను ఆగస్టు 5వ తేదీన నిర్వహిస్తున్నారు. ఒహాయో కొలంబస్‌లో జరిగే ఈ పోటీలు ఉదయం 7.30 నుంచి ప్రారంభమవుతాయి. తానా అధ్యక్షుడు నిరంజన్‌ శృంగవరపు, తానా స్పోర్ట్స్‌ కో ఆర్డినేటర్‌ నాగ పంచుమర్తి ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీలకు ఏర్పాట్లను చేస్తున్నారు. తానా ఫౌండేషన్‌ ట్రస్టీ రవి సామినేని, తానా ఒహాయో వ్యాలీ రీజినల్‌ రిప్రజెంటేటివ్‌ శివ చావా ఈ పోటీల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సెమిఫైనలిస్ట్‌, ఫైనలిస్ట్‌ టీమ్‌లకు నగదు బహుమతులను అందించనున్నారు. వేణు చావా, వంశీ మద్దులూరి, సిద్దార్థ రేవూర్‌, శ్రీకాంత్‌ మునగాల ఈ పోటీల విజయవంతానికి కృషి చేస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events