Namaste NRI

ఆగ‌స్ట్ 4న కృష్ణ గాడు అంటే ఒక రేంజ్

రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం కృష్ణ గాడు అంటే ఒక రేంజ్. శ్రీ తేజస్ ప్రొడక్షన్ ప్రై.లి బ్యానర్ పై పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కే శ్రీలత, పెట్లా ర‌ఘురామ్‌ మూర్తి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. రాజేష్ దొండపాటి తెరకెక్కించిన ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్‌ను పొందింది. ఆగ‌స్ట్ 4న ఈ ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ను గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ చేస్తున్నారు నిర్మాత‌లు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, టీఎఫ్‌సీసీ సెక్రటరీ కే ఎల్ దామోదర్ ప్రసాద్, బెక్కం వేణుగోపాల్, రైటర్ ప్రసన్న కుమార్ వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ కృష్ణ గాడు అంటే ఒక రేంజ్ కు ఆల్ ది బెస్ట్. చ‌క్క‌టి కుటుంబ క‌థా చిత్రంగా సినిమాను విజయవంతంగా పూర్తి చేసిన ప్రతీ టీం మెంబర్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా వరంగల్ వాళ్లకి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు  అని అన్నారు.

నిర్మాత పెట్లా ర‌ఘురామ్‌ మూర్తి మాట్లాడుతూ రెండున్నరేళ్ల ప్రయాణం ఈ సినిమా. సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా చేసుకుంటూ సినిమాల్లోకి ఎందుకు వచ్చావ్ అని అందరూ అడుగుతున్నారు. సినిమా ద్వారా మనుషుల్ని కదలించొచ్చు. ప్రతి మనిషి జీవితంలో కథలుంటాయి. కృష్ణ అనే యువ‌కుడి క‌థే ఇది. తండ్రి క‌ల‌ను నేర‌వేర్చ‌టానికి కొడుకు ప‌డ్డ క‌ష్టం. త‌న ప్రేమ‌, భావోద్వేగాల‌ను అందంగా చూపించే ప్ర‌య‌త్నమే మా కృష్ణగాడు అంటే ఒక రేంజ్. ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలకు, ఆశీర్వదించాల్సిన ప్రేక్షకులకు ధన్యవాదాలు అని తెలిపారు. మంచి టీమ్‌ని ఇచ్చి, ఏది అడిగితే అది ఇచ్చిన నిర్మాతలకు దర్శకుడు రాజేష్ దొండపాటి కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో మాట్లాడారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events