Namaste NRI

కడుపుబ్బా నవ్విస్తున్న డ్రీమ్ గర్ల్ 2 ట్రైలర్

ఆయుష్మాన్‌ హీరో గా నటిస్తోన్న చిత్రం డ్రీమ్‌ గర్ల్‌-2. రాజ్‌ శండియాలానే దర్శకత్వ. కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆయుష్మాన్‌కు జోడీగా అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తుంది. బాలాజీ మోషన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై ఏక్తాకపూర్‌, శోభా కపూర్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.   ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటుంది. తాజాగా చిత్రబృందం ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. తొలిపార్టులో లేడీ వాయిస్‌తో నవ్వించిన ఆయుష్మాన్‌ ఈ సారి ఏకంగా లేడీ గెటప్‌తోనే వచ్చాడు. అత్యవసర పరిస్థుతిల్లో లేడీ గెటప్‌ వేయాల్సి వస్తుంది. ఇక ఆ గెటప్‌ను కంటిన్యూ చేస్తూ మగాళ్లతో ఆడుకునే ఆట వేరే లెవల్లో ఉండబోతుందని ట్రైలర్‌తో స్పష్టమైంది. ట్రైలర్‌ ఫస్ట్‌ ఫ్రేమ్‌ నుంచి లాస్ట్‌ ఫ్రేమ్‌ వరకు అవుట్ అండ్‌ అవుట్‌ హిలేరియస్‌ రైడ్‌లా సాగింది. లేడీ గెటప్‌లో ఆయుష్మాన్‌ ఫర్‌ఫెక్ట్‌గా సెట్‌ అయ్యాడు. ముఖ్యంగా మురళిధరణ్ సినిమాటోగ్రఫి మాత్రం టాప్‌ నోట్చ్‌లో ఉంది. హితేష్ సోనిక్‌ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ కూడా బాగుంది. ట్రైలర్‌ చూస్తుంటే ఈ సీక్వెల్‌లో తొలిపార్టుకు మించి ఫన్‌ ఉండనున్నట్లు తెలుస్తుంది. డ్రీమ్ గర్ల్ 2 ఇప్పుడు ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు వీఎఫ్ఎక్స్ పనులు చాలా ఉండటంతో ఆలస్యమైనట్లు మేకర్స్ వెల్లడించారు. 

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events