కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో దంపతులు విడిపోతున్నట్లు ప్రకటించారు. తమ 18 ఏండ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు పలుకుతున్నట్లు చెప్పారు. పలుమార్లు చర్చింకున్న తర్వాతే తాము విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు వెళ్లడించారు. చట్టబద్ధంగా విడిపోయే ఒప్పందంపై జస్టిన్ ట్రుడో, సోఫీ గ్రెగోయ్‌రీ ట్రుడో దంపతులు ఇప్పటికే సంతకం చేశారని ప్రధాని కార్యాలయం తెలిపింది. 2005, మే నెలలో జస్టిన్ ట్రుడో, సోఫీ గ్రెగోయ్‌రీ వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం విడిపోతున్నప్పటికీ వారి సంరక్షణను తామిద్దరం కలిసే చూసుంటామని ట్రుడో దంపతులు వెల్లడించారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)