మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్, ఎక్స్ (ట్విట్టర్), టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కేజ్ మధ్య ముష్టి యుద్ధం ఖరారైంది. వీరిద్దరూ కేజ్‌ఫైట్‌కు సిద్ధమయ్యారు. తమ ఫైట్ ఎక్స్(ట్విట్టర్)లో ప్రత్యక్ష ప్రసారమవుతుందని మస్క్ ట్వీట్ చేశారు. అయితే, ఫైట్ తేదీ మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. ఉప్పు నిప్పుగా ఉండే ఈ దిగ్గజ సీఈవోలు కొంతకాలంగా సవాళ్లు, ప్రతిసవాళ్లతో వార్తల్లో ప్రముఖంగా నిలుస్తున్నారు. కొద్దిరోజుల క్రితం జుకర్‌ను కేజ్‌ఫైట్‌కు రావాలని మస్క్ కవ్వించగా, ఎక్కడ తలపడుదామో చెప్పు అని జుకర్ కూడా అంతే స్థాయిలో సవాల్ విసిరారు. జుక్-మస్క్ పోరాటం ఎక్స్‌లో ప్రత్యక్ష ప్రసారమవుతుంది. ఈ మ్యాచ్‌తో వచ్చే డబ్బంతా వృద్ధుల సంక్షేమం కోసం ఖర్చు చేస్తాం అని మస్క్ తెలిపాడు.