నందమూరి కళ్యాణ్ రామ్ హీరో గా నటిస్తున్న చిత్రం డెవిల్ . సంయుక్తా మీనన్ కథానాయిక. దేవాన్ష్ నామా సమర్పకుడిగా అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై నవీన్ మేడారం దర్శకత్వంలో అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలె విడుదలైన ఈ సినిమా గింప్ల్స్ హీరో పాత్ర తీరు తెన్నులు, డెవిల్ పాత్రలో తను ఒదిగిపోయిన విధానం, లుక్‌కు అద్భుతమైన స్సందన వచ్చింది. దీంతో సినిమాపై ఉన్న అంచనాలు నెక్ట్స్ రెంజ్‌కు చేరుకున్నా యి. డెవిల్ చిత్రంలో ఎవరికీ అంతు చిక్కని ఓ రహస్యాన్ని ఛేదించే బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా నందమూరి కళ్యాణ్ రామ్ ఆకట్టుకోబోతున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిం దీ, తమిళ్, కన్నడ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. శ్రీకాంత్ వి స్సా ఈ చిత్రానికి మాటలు, స్క్రీన్ ప్లే, కథను అందించారు. ఈ నేపథ్యంలో నవంబర్ 24న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నట్లు పోస్టర్ ద్వా రా ప్రకటించారు.