Namaste NRI

బోయపాటి శ్రీను, రామ్ పోతినేని చిత్రం స్కంద షూటింగ్ పూర్తి

రామ్‌ పోతినేని హీరోగా , బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా స్కంద . ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్స్ ప‌తాకంపై ప‌వ‌న్ కుమార్ స‌మ‌ర్పణలో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.  ఫైనల్ సాంగ్ షూటింగ్‌తో స్కంద చిత్రీకరణ పూర్తయింది. సాంగ్ షూట్‌ లొకేషన్‌లో థంబ్స్‌ అప్‌ సింబల్‌ చూపిస్తూ, ఇదే విషయాన్ని చెప్పారు బోయపాటి, రామ్‌, శ్రీలీల. ఈ పాట కూడా విజువల్ ఫీస్ట్‌లా ఉండబోతున్నట్టు తాజా లుక్‌తో అర్థమవుతోంది. స్కంద చిత్రాన్ని సెప్టెంబర్‌ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది రామ్‌- బోయపాటి టీం‌. ఈ ప్రాజెక్ట్‌ తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్నడ, హిందీలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events