మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం గుంటూరు కారం. శ్రీలీల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్ గా కనిపించనుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు మరో ైస్టెలిష్ లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఇటీవల విడుదలైన గ్లింప్స్‌కి మంచి స్పందన వచ్చిందని, ఈనెల ద్వితీయార్థంలో చిత్రీకరణ ప్రారంభిస్తామని, సంక్రాంతి కానుకగా 2024, జనవరి 12న చిత్రాన్ని విడుదల చేస్తామని చిత్రబృందం తెలిపింది.