Namaste NRI

ప్రేమకథలపై మళ్లీ ప్రేమ పుట్టింది: విజయ్‌ దేవరకొండ

విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ఖుషి. సమంత కథానాయిక. శివ నిర్వాణ దర్శకుడు. నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ ఖుషి తో రెండేళ్లుగా ప్రయాణం చేస్తున్నాను. ఈ క్రమంలోనే ఎన్నో ఎమోషన్స్‌ గురయ్యాను. దేశంలోని అనేక అందమైన ప్రదేశాల్లో ఈ సినిమా చిత్రీకరణ చేశాం. అందరి సపోర్ట్‌తో ఓ అద్భుతమైన సినిమాను తీశాను. ఈ సినిమాతో ప్రేక్షకులపై నాకున్న ప్రేమను చూపించబోతున్నాం. లవ్‌ అండ్‌ సెలబ్రేషన్‌ ఈ రెండు ఖుషి సినిమాలో వుంటాయి  అన్నారు.

విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ ఖుషి ఇదొక అమేజింగ్‌ ఫిల్మ్‌. క్యూట్‌ లవ్‌ ఫిల్మ్‌. దేశవ్యాప్తంగా ప్రేక్షకులు మా కథకు కనెక్ట్‌ అవుతారు. మన సంప్రదాయాలు, కుటుంబ బంధాలు, వివాహవ్యవస్థ వంటి అంశాలతో ముడిపడిన సినిమా ఇది. ఇలాంటి చిత్రంలో భాగమవడం సంతోషంగా వుంది అన్నారు.  ఇప్పుడు దేశవ్యాప్తంగా మన కథలను చూపించే అవకాశం దక్కుతోంది. ఇలాంటి సమయంలో నేను హీరోగా వుండటం అదృష్టంగా భావిస్తున్నాను.  నాకు ప్రేమకథలపై ఆసక్తి తగ్గిపోయింది.ఖుషి కథ విన్న తరువాత మళ్లీ ప్రేమకథలో నటించాలని ఆసక్తి కలిగింది.వివాహం అనేది మన జీవితంలో ముఖ్యమైన ఛాప్టర్‌. త్వరలోనే నేను ఆ ఛాప్టర్‌లోకి అడుగుపెడతా  అన్నారు.

 విజయ్‌తో తమ సంస్థలో చేస్తున్న రెండో సినిమాగా ఓ క్యూట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా  ఖుషిని నిర్మించామని, అబ్దుల్‌ వాహబ్‌ సూపర్బ్‌ మ్యూజిక్‌ ఇచ్చారని, సెప్టెంబర్‌ 1న చిత్రాన్ని విడుదల చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు.  ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు అబ్దుల్‌ వాహబ్‌, డీవోపీ జి.మురళి, సీఈవో చెర్రీ, చిత్ర నిర్మాతలు తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events