టోక్యో ఒలింపిక్స్‌లో పోటీపడిన భారత క్రీడాకారులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తేనీటి విందు ఇచ్చారు. క్రీడాకారులను రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానించిన ఆయన వారికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ ఒలింపిక్ అథ్లెట్లను చూసి దేశం గర్వపడుతోందని పేర్కొన్నారు. భారత ఒలింపిక్స్ చరిత్రలో ఈసారి అత్యధిక పతకాలు అందించారని వారిని ప్రశంసించారు. మహిళా క్రీడాకారులపై అభినందనలు కురిపించారు. ఈ విపత్కర పరిస్థితుల్లోనూ భారతావని సంబురాలు చేసుకునేలా చేశారు. ఎన్నో ఒడిదొడకులను ఎదుర్కొంటూ ప్రపంచస్థాయి ప్రదర్శన చేశారు. కొన్నిసార్లు గెలుస్తాం. మరికొన్ని సార్లు ఓడిపోతాం. కానీ ప్రతిసారీ కొత్త విషయాలను నేర్చుకొంటాం అని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఆయనతో పాటు క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, క్రీడాశాఖ మాజీ మంత్రి కిరణ్ రిజుజుతో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు.