శ్రీరామ్, అయ్యప్ప శర్మ, నటుడు రాజేంద్రప్రసాద్ మనవరాలు సాయి తేజిస్విని, సుమన్‌బాబు తదితరులు నటించిన ఎర్రచీర చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. శ్రీ సుమన్ వేంకటాద్రి ప్రొడక్షన్స్ – పద్మాలయా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా బేబీ డమరి సమర్పణలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కారుణ్య చౌదరి, కమల్ కామరాజు, అజయ్, అలీ, రఘుబాబు, గీతాసింగ్, జీవ, భద్రం, సురేష్ కొండేటి, అన్నపూర్ణమ్మ, సత్య కృష్ణ తదితరులు నటించారు. దీపావళి సందర్భంగా నవంబర్ 9న రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాతల్లో ఒకరైన ఎన్వీవీ సుబ్బారెడ్డి చెప్పారు. మదర్ సెంటిమెంట్, హారర్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో చిత్రం తయారైంది. లక్షలాది మంది అఘోరాలతో చిత్రీకరించిన పతాక సన్నివేశాలు థ్రిల్లింగ్‌గా ఉంటాయి. సినిమాలో 35 నిమిషాల పాటు ఉన్న గ్రాఫిక్స్ వర్క్ కచ్చితంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది అని మరో నిర్మాత, నటుడు. దర్శకుడు సుమన్‌బాబు చెప్పారు. బేబి ఢమరి సమర్పకురాలు.