రామ్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం డబుల్ ఇస్మార్ట్. పూరి కనెక్ట్స్ పతాకంపై పూరి జగన్నాథ్, ఛార్మికౌర్ నిర్మిస్తున్నారు. ముంబయిలో షూటింగ్‌ను షెడ్యూల్‌లో యాక్షన్ ఘట్టాల్ని తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా రెండో షెడ్యూల్ థాయ్‌లాండ్‌లో ప్రారంభమైంది. ఇందులో హీరో రామ్, సంజయ్‌దత్‌పై ముఖ్య సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. ఈ చిత్రంలో సంజయ్‌దత్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన మునుపెన్నడూ చూడని పవర్‌ఫుల్ విలన్ పాత్రలో కనిపిస్తారని చెబుతున్నారు. థాయ్‌లాండ్ షెడ్యూల్‌లో రామ్, సంజయ్‌దత్‌పై తీసే సన్నివేశాలు హైలైట్‌గా నిలుస్తాయని చిత్ర బృందం పేర్కొంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. డబుల్ ఇస్మార్ట్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మార్చి 8, 2024న మహా శివరాత్రికి విడుదలౌతుంది.