యూకే వీసా పొందడటం ఇప్పుడు మరింత సులభంగా మారింది. ఇకపై బెంగళూరు, మంగళూరు, విశాఖపట్నంలోని తాజ్ హోటళల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆయా హోటళల్లోని ఏర్పాటైన వీసా ఔట్‌సోర్సింగ్ సేవల సంస్థ వీఎఫ్ఎస్ గ్లోబల్ కేంద్రాల్లో వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు వీఎఫ్ఎస్ గ్లోబల్ సంస్థ టాటాలకు చెందిన ఇండియన్ హోటల్స్ కంపెనీ, రాడిస్ హోటల్స్ గ్రూప్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. బెంగళూరు, మంగళూరులోని వివాంతా, విశాఖపట్నంలోని ది గేట్వే హోటల్‌లో ఈ సదుపాయం ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు వీఎఫ్ఎస్ గ్లోబల్ సోషల్ మీడియాలో పేర్కొంది. దీంతో పాటూ నోయిడా, లూథియానా, అమృతసర్, మోహాలీలోని సంబంధిత హోటళ్లలో కూడా వీసా దరఖాస్తు, బయోమెట్రిక్ వివరాలను నమోదు చేసుకోవచ్చు.