బ్రిటన్‌లో 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా 100 మందితో ఓ ప్రముఖ ఆరెస్ట్రా, మూడు సార్లు గ్రామీ అవార్డు విజేత రికీ కేజ్ ఆధ్వర్యంలోని బృందం తమ సంగీత పరికరాలతో జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా రికీ కేజ్ మాట్లాడారు. లండన్‌లోని పేరుపొందిన అబే రోడ్ స్టూడియోస్‌లో ది రాయల్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రా కు చెందిన 100 మంది కళాకారుల బృందంతో జనగణమన గీతాన్ని రికార్డు చేశా. భారత జాతీయ గీతాన్ని రికార్డ్ చేసిన అతిపెద్ద ఆర్కెస్ట్రా ఇదే. చాలా అద్భుతంగా వచ్చింది. గీతం చివర్లో నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. భారతీయ స్వరకర్తగా గొప్ప అనుభూతిని పొందా అని పేర్కొన్నారు.