Namaste NRI

కృష్ణాష్టమికి వస్తున్న పొలిశెట్టి

నవీన్‌ పొలిశెట్టి, అనుష్క జంటగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి. మహేష్‌బాబు.పి దర్శకుడు. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్నారు. సెప్టెంబర్‌ 7న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో అన్విత రవళి పాత్రలో అనుష్క, స్టాండప్‌ కమెడియన్‌ సిద్ధు పొలిశెట్టి పాత్రలో నవీన్‌ పొలిశెట్టి జంట చక్కటి వినోదాన్ని పండిస్తుంది. రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సరొకొత్త ప్రేమకథతో ఈ చిత్రం అందరిని ఆకట్టుకుంటుంది అని చిత్ర బృందం పేర్కొంది.

ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా హీరో నవీన్ పోలిశెట్టి చేసిన స్పెషల్ వీడియో ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో జ్యోతిష్యుడు రంగస్థలం మహేశ్‌ను మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రిలీజ్ డేట్ చెప్పమని అడగడం, అతను 70, 80 ఏళ్ల తర్వాత రిలీజ్ చేసుకోమని అనడం, చివరకు నవీన్ పోలిశెట్టి హే కృష్ణా అంటూ ఉట్టికొట్టి కృష్ణాష్టమికి మా సినిమాను తీసుకొస్తున్నాం అని ప్రకటించడం ఆసక్తికరంగా అనిపించింది. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సెప్టెంబర్ 7న తెలుగు, తమిళం,కన్నడ, మలయాళం భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. సెప్టెంబర్ 6, 7 తేదీల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం ఉండటంతో సినిమా చూసేందుకు ఈ హాలీడేస్ ఆడియెన్స్ కు కలిసిరానున్నాయి. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: నీరవ్‌షా, ప్రొడక్షన్‌ డిజైనర్‌: రాజీవన్‌, నిర్మాతలు: వంశీ-ప్రమోద్‌, రచన-దర్శకత్వం: మహేష్‌బాబు.పి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events