Namaste NRI

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం వైఎస్‌ జగన్‌

విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. జెండా వందనం తర్వాత సాయుధ దళాల నుంచి ముఖ్యమంత్రి గౌరవవందనం స్వీకరించారు. వివిధ ప్రభుత్వ శాఖలు రూపొందించిన శకటాల ప్రదర్శనను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తిలకించారు. అనంతరం ప్రజలు ఉద్దేశించి జగన్‌ ప్రసంగించారు. రాష్ట్ర ప్రజలకు స్వాతంత్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త లక్ష్యాలను నిర్దేశించుకునే సమయం ఇదని, రేపు అనేది ప్రతి ఒక్కరికీ భరోసా ఇవ్వాలన్నారు. హక్కులు అందరికీ సమానంగా అందాలని అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress