శ్రీలంకన్ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ వస్తోన్న విషయం తెలిసిందే. 800 టైటిల్ తో వస్తోన్న ఈ మూవీలో మురళీధరన్ పాత్రలో స్లమ్ డాగ్ మిలియనీర్ ఫేం మధుర్ మిట్టల్ నటిస్తున్నాడు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం. మురళీధరన్ లుక్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా మెస్మరైజ్ చేస్తున్నాడు మధుర్ మిట్టల్. కాగా ఈ చిత్రానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఫిలింనగర్ సర్కిల్‌లో రౌండప్ చేస్తోంది. తమిళంతోపాటు హిందీ, తెలుగు భాషల్లో కూడా విడుదల కానున్న ఈ చిత్రాన్నిమూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై వివేక్ రంగచారి నిర్మిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ అధినేత, పాపులర్ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ 800 పాన్ ఇండియా థ్రియాట్రికల్ రైట్స్‌ను దక్కించుకున్నట్టు టాలీవుడ్ సర్కిల్ సమాచారం.మహిమ నంబియార్ కీలక పాత్రలో నటించనుండగా, ఘిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. అక్టోబర్‌లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)