Namaste NRI

ప్రపంచ దేశాలన్నిటిలో భారత్ లోనే అధికం… బ్రిక్స్ సదస్సులో మోడీ

ప్రపంచ దేశాలన్నిటిలో అత్యధికంగా డిజిటల్ లావాదేవీలు చేస్తోన్న దేశం భారత్  అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దక్షిణాఫ్రికాలో నిర్వహించిన బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ  పాల్గొన్నారు. పదో వార్షికోత్సవం సందర్భంగా బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్ను అభినందించారు. ఈ సందర్భంగా  మోడీ  మాట్లాడుతూ   రానున్న కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ కీలక భూమిక పోషించనుందని తెలిపారు. 2047నాటికి భారత దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చటమే దేశ ప్రజల సంకల్పమని చెప్పారు. పదేళ్లుగా ఆర్థిక సహకారాన్ని అందించటంలో బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్ పాత్ర కీలకమైనదని తెలిపారు.

అనంతరం యూపీఐ సేవల గురించి కొనియాడారు. ప్రస్తుతం సింగిల్ క్లిక్ విధానంతో పెద్ద సంఖ్యలో ప్రజలు డిజిటల్ లావాదేవీల్లో పాలుపంచుకుంటున్నారు. దీంతో లావాదేవీల్లో పారదర్శకత పెరిగి, మధ్యవర్తిత్వం, అవినీతి తగ్గుముఖం పట్టింది. చిన్న దుకాణం నడిపే వారి దగ్గర నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ నిర్వహించే వారి వరకు అందరూ యూపీఐ సేవల్ని వినియోగిస్తున్నారు.  యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సింగపూర్ , ఫ్రాన్స్ దేశాలు కూడా ఈ సేవల్ని అందిపుచ్చుకోనున్నాయి. అంటూ యూపీఐ విస్తరణ గురించి తెలిపారు. బ్రిక్స్ లోని దేశాలు కూడా ఈ సేవలు వినియోగించే అవకాశాలు ఉన్నాయన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events