Namaste NRI

వెన్నెల కిశోర్ హీరోగా చారి 111

వెన్నెల కిషోర్‌ హీరోగా నటిస్తున్న చిత్రం చారి 111. సంయుక్తా విశ్వనాథన్‌ కథానాయికగా నటిస్తున్నారు.  టీజీ కీర్తికుమార్‌ దర్శకత్వంలో అదితి సోని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఈ చిత్రం కాన్సెప్ట్‌ టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు. మురళీ శర్మ కీలక పాత్రలో కనిపించనున్నారు.  దర్శకుడు మాట్లాడుతూ ఇదొక యాక్షన్‌ కామెడీ సినిమా.  ఇందులో  వెన్నెల కిషోర్‌ గూఢచారి పాత్రలో కనిపిస్తారు. ఓ సీటిలో జరిగే అనుమానాస్పద ఘటనలను చేధించే రహస్య గూఢచారి పాత్రలో ఆయన లుక్‌ వైవిధ్యంగా వుంటుంది. స్టెలిష్‌ యాక్షన్‌ సన్నివేశాలతో ఆద్యంతం వినోదభరితంగా సాగుతూ ప్రేక్షకుడిని అలరించే విధంగా చిత్రం వుంటుంది అన్నారు. చిత్ర నిర్మాత అదితి సోనీ మాట్లాడుతూ స్పై జానర్ సినిమాల్లో చారి 111 కొత్తగా ఉంటుంది. వెన్నెల కిశోర్ గారి నటన, టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం సినిమాకు హైలైట్ అవుతాయి. కథలో చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి. అందులో విలన్ రోల్ ఒకటి. విలన్ ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇప్పటి వరకు చిత్రీకరణ చేసిన సన్నివేశాలు మాకు ఎంతో సంతృప్తిని ఇచ్చాయి. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది అని చెప్పారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events