అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ చరిత్ర సృష్టించింది. చంద్రయాన్-3 సక్సెస్‌ఫుల్ ల్యాండింగ్ కాగానే ప్రపంచ నాయకులు, శాస్త్రవేత్తలు ఇండియాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ సైతం భారత్‌ను అభినందించారు. అంతరిక్ష పరిశోధనలో ఇదొక పెద్ద ముందడుగు అని, సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో భారతదేశం పురోగతికి నిదర్శనమని పుతిన్ పేర్కొన్నారు. భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండ్ అయిన సందర్భంగా భారత్‌కు నా హృదయపూర్వక అభినందనలు. అంతరిక్ష పరిశోధనలో ఇదొక పెద్ద ముందడుగు. శాస్త్ర సాంకేతిక రంగంలో భారతదేశం సాధించిన అద్భుతమైన పురోగతికి ఈ విజయం నిదర్శనం. దీన్ని సాధ్యం చేసిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ నాయకత్వం, సిబ్బందికి నా హృదయపూర్వక అభినందనలు అని పుతిన్ పేర్కొన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)