Namaste NRI

సెన్సారు పూర్తిచేసుకున్న ఖుషి

విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న చిత్రం ఖుషి. శివ నిర్వాణ దర్శకుడు. నవీన్‌ యెర్నేని, వై రవిశంకర్‌లు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సెన్సారును పూర్తిచేసుకుంది. యూఏ సర్టిఫికెట్‌ జారీ చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ 165 నిమిషాల నిడివితో గల ఖుషి సినిమా మూవీ ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయడానికి రెడీగా వుంది.  ఫీల్‌ గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా చిత్రం అందర్ని అలరిస్తుందనే నమ్మకం వుంది. ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్‌తో అందరిలోనూ సినిమాపై మంచి బజ్‌ ఏర్పడింది. తప్పకుండా అందరి అంచనాలకు తగిన విధంగా చిత్రం బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అవుతుందనే నమ్మకం వుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా చిత్రాన్ని విడుదల చేస్తున్నాం అన్నారు.

ఖుషి నుంచి విడుదల ఫస్ట్‌ సింగిల్‌ నా రోజా నువ్వే మ్యూజిక్‌ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తూ నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ ట్రెండింగ్‌లో నిలుస్తోంది. మరోవైపు ఆరాధ్య సాంగ్‌తోపాటు మిగిలిన పాటలు సినిమాపై హైప్ పెంచుతున్నాయి. ఈ సినిమాకు మలయాళ మ్యూజిక్‌ డైరెక్టర్‌ హేశమ్‌ అబ్ధుల్‌ వహబ్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం సెప్టెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events