గృహ అవసరాలకు వినియోగించిన విద్యుత్, వాటర్ తాలూకు పెండింగ్ బిల్లు క్లియర్ చేసిన తర్వాతే ప్రవాసులు దేశం దాటాలనే కొత్త నిబంధనను అమలు చేసేలా కువైత్ పావులు కదుపుతోంది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి దేశం విడిచిపెట్టి వెళ్లాలనుకునే ప్రవాసులు ట్రాఫిక్ చలాన్ల మాదిరిగానే ఎలక్ట్రిసిటీ బిల్స్‌ను సైతం చెల్లించడం తప్పనిసరి చేసింది. ఈ మేరకు ఆ దేశ విద్యుత్, నీరు మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వశాఖ తాజాగా ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 1వ తారీఖుు నుంచి ఈ నిబంధన అమలులోకి వస్తుందని వెల్లడించింది.
కరెంట్ బిల్లు బకాలను మ్యూ-పే లేదా సహేల్ యాప్ ద్వారా చెల్లించవచ్చని పేర్కొంది. అలాగే ప్రభుత్వ ఎలక్ట్రానిక్ సర్వీసులు లేదా కువైత్ ఇంటర్నెషనల్ ఎయిర్‌పోర్టులోని టెర్మినల్-04లోని కస్టమర్ సర్వీస్ కేంద్రంలో కూడా బిల్లులు చెల్లించే వెసులుబాటు కల్పించినట్లు ఈ సందర్భంగా మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.