విజయ్ దేవరకొండ , సమంత హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ఖుషి. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా వచ్చి ఈ చిత్రం సక్సెస్ఫుల్ టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కించిన ఈ చిత్రంలో సచిన్ ఖడేకర్, మురళీ శర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, కన్నడ యాక్టర్ జయరాం, శరణ్య ప్రదీప్ కీలక పాత్రలు పోషించారు. మంచి సక్సెస్ అందుకోవడంతో విజయ్ దేవరకొండ ఫుల్ ఖుషీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఖుషి టీం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకుంది. విజయ్ దేవరకొండ, కుటుంబ సభ్యులు, ఖుషి మూవీ టీం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి అర్చకులు ఆశీర్వాదం అందించారు. అంతకుముందు ఆలయ అర్చకులు ఆలయ సాంప్రదాయం ప్రకారం విజయ్ దేవరకొండ ఫ్యామిలీ, ఖుషి చిత్రయూనిట్‌కు స్వాగతం పలికారు. శివ నిర్వాణ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్1న గ్రాండ్‌గా విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది.