కుల వివక్షకు వ్యతిరేకంగా తొలిసారిగా చట్టం చేయనున్న రాష్ట్రంగా అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం నిలిచిపోనున్నది. 31-5 ఓట్ల మెజారిటీతో ఈ బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందింది. ఈ బిల్లుపై గవర్నర్ సంతకం పెడితే అది చట్టంగా మారుతుంది. ఈ క్రమంలో ఆ బిల్లుపై గవర్నర్ గేవిన్ న్యూసమ్ వెంటనే సంతకం పెట్టి ఆమోదముద్ర వేయాలని డిమాండ్ చేస్తూ కొందరు మద్దతుదారులు నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఇక ఈ చట్టం పరిధిలోకి కులాలను తీసుకొచ్చి అట్టడుగు వర్గాలు ఎదుర్కొంటున్న వివక్షత నుంచి రక్షణ కల్పిస్తోంది. అయితే ఈ బిల్లును తొలిసారిదా అయిష వాహబ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అలాగే దీనికి దేశవ్యాప్తంగా వివిధ కుల, జాతులకు చెందిన ఉద్యమ సంఘాలు కూడా తమ మద్ధతు తెలిపాయి.