రామ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం స్కంద. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ నెల 28న విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో నాయకానాయికలు రామ్, శ్రీలీల సంప్రదాయ వస్త్రధారణలో చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నారు. రిలీజ్‌కు మంచి డేట్ దొరికింది. వీకెండ్‌తో పాటు వరుస సెలవులు ఉండటం కలిసొచ్చే అంశం అనుకుంటున్నాం. దర్శకుడు బోయపాటి శ్రీను తనదైన శైలి పవర్‌ఫుల్ యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్ అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రామ్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో తీసిన సినిమా ఇది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నాం అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: సంతోష్ డిటాకే, సంగీతం: తమన్.స్కంద మూవీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా విడుదల కానుంది.