ఆస్ట్రేలియాలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో డిప్యూటీ మేయర్‌గా గెలిచిన తెలంగాణ బిడ్డ సంధ్యా రెడ్డి (శాండీ రెడ్డి)ని ఎన్నారై కోఆర్డీనేటర్ మహేష్ బిగాల అభినందించారు. ఇది తెలంగాణ బిడ్డకు దక్కిన గౌరవం అని ప్రశంసించారు. సెప్టెంబర్ 5న జరిగిన సాధారణ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్ కరెన్ పెన్సబెన్ మేయర్‌గా ఎన్నికయ్యారని, కౌన్సిలర్‌గా గెలిచిన తెలంగాణ బిడ్డ సంధ్యా రెడ్డి డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారని స్ట్రాత్‌ఫీల్డ్ కౌన్సిల్ ప్రకటించారు. ఉత్కంఠ భరితంగా జరిగిన పోరులో శాండీ కౌన్సిలర్‌గా గెలుపొంది డిప్యూటీ మేయర్‌గా ఎన్నికవడం సంతోషంగా ఉందన్నారు. కాగా, సంధ్యా రెడ్డి కి 2020 సంవత్సరానికి స్ట్రాత్‌ఫీల్డ్ సిటిజన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)