సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ఎమ్మెల్సీ కవిత పోరాడుత్ను తీరు ప్రశంసనీయమని బీఆరెస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ కో ఆర్డినేటర్ మహేష్ బిగాల అన్నారు. ఈ సందర్భంగా మహేష్ బిగాల మాట్లాడుతూ త్వరలో జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అయినా, మహిళా బిల్లును ఆమోదించాలని, అందుకోసం ప్రయత్నాలు కూడా మొదలుపెట్టడం మంచి పరిణామం అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కు ఎన్ఆర్ఐల మద్దతుకై ప్రచారాన్ని ఈ సంవత్సరం మార్చిలో ప్రారభించిన విషయాన్ని గుర్తుచేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా ప్రపంచ వ్యాప్తంగా ఎన్ఆర్ఐల మద్దతు కోసం మొదటిసారిగా ఆస్ట్రేలియాలో ప్రచారం ప్రారంభించామని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు తమ మద్దతు తెలపాలని కోరారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం దేశవ్యాప్తంగా మహిళలను ఐక్యం చేసి బిల్లును సాధిస్తారని ఆశాబావం వ్యక్తం చేశారు.