అమెరికాలోని కాలిఫోర్నియాలో ప్రవేశపెట్టిన కుల వివక్ష నిరోధక బిల్లుపై ఇండో అమెరికన్లు, పలు హిందూ సంస్థలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర రాజధాని శాక్రమెంటోలో ఉన్న గవర్నర్ గెవిన్ న్యూసమ్ కార్యాలయం ఎదుట శాంతియుతంగా ప్రదర్శనలు నిర్వహించారు. ఈ చట్టం ఇండో అమెరికన్లను లక్ష్యంగా పెట్టుకుని రూపొందించారని, ఆ వర్గాలకు వేధింపులు తప్పవని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బిల్లును గవర్నర్ ఆమోదించకుండా తిరస్కరించాలని వారు డిమాండ్ చేశారు.
