చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బీఆర్‌ఐ) ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలనుకుంటున్నట్టు ఇటలీ ప్రకటించింది. ప్రతిష్ఠాత్మకమైన ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరోప్ వాణిజ్య కారిడార్‌పై ఆసక్తితో ఉన్నట్టు జీ20 దేశాలు సమావేశంలో ప్రకటించి ఒక రోజు కూడా గడవక ముందే చైనాకు ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్‌ఐ ఒప్పందం నుంచి వైదొలగాలని భావిస్తున్నట్టు ఇటలీ ప్రధాని జియార్జియా మెలోని జీ20 సదస్సు సైడ్‌లైట్స్‌లో చైనాకు స్పష్టం చేశారు. ఈ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలంటూ చైనా ప్రతినిధి చేసిన విజ్ఞప్తిని తిరస్కరించిన ఆమె తన నిర్ణయాన్ని కుండబద్దలు కొట్టారు. తమ అంచనాలకు అనుగుణంగా బీఆర్‌ఐ ప్రాజెక్టు లేకపోవడం వల్ల తప్పుకోవాలని భావిస్తున్నట్టు ఆ దేశ ప్రతినిధులు పలు వేదికలపై ఇప్పటికే అభిప్రాయపడ్డారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)