ముఖ్యమంత్రిగా, జాతీయ నేతగా, దార్శనికుడిగా పేరు గడించిన నారా చంద్రబాబు నాయుడును అక్రమ అరెస్ట్ చేయటం పూర్తిగా ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాలరాయటమేనని ప్రవాస భారతీయులు ఖండించారు. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్త బంద్కు సంఘీభావంగా కొవ్వొత్తుల ప్రదర్శన చేసారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీ.సీ పరిధిలో సతీష్ వేమన ఆధ్వర్యంలో జరిగిన ఈ కొవ్వొత్తి రాలీలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రవాస భారతీయులు, వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రస్తుత రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, అవలంబిస్తున్న కక్ష పూరిత విధానాలను నిర్ద్వంద్వంగా ఖండించారు.
సతీష్ వేమన మాట్లాడుతూ 73 ఏళ్ళ వయసులో కూడా టీడీపీ అధినేత చంద్రబాబు తనపై వచ్చిన ఆరోపణలకు, ఒక సామాన్య పౌరునిగా పోలీసు వ్యవస్థకు సహకరించి, చట్టాలను గౌరవిస్తూ న్యాయస్థానం సాక్షిగా తన పోరాటాన్ని కొనసాగిస్తున్నారని కొనియాడారు. నిజానిజాలు త్వరలోనే తేలుతాయని, రాష్ట్ర ప్రజలు చంద్రబాబుతోనే ఎల్లప్పుడూ ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుశాంత్ మన్నే, నెహ్రు, పుల్లారెడ్డి, రమేష్ గుత్తా, మాల్యాద్రి, భాను వలేటి, సామంత్, మురళి, వినీల్, జాఫర్, అమ్మిరాజు, కాంతయ్య, సురేష్, సత్యనారాయణ, బసవరావు, యుగంధర్, మాధవరావు పాల్గొన్నారు.