తెలుగుజాతిని అభివృద్ధి పథంలో నిలిపిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు అరెస్ట్ దుర్మార్గమని అనిల్ యార్లగడ్డ అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తూ అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం జాక్సన్ విల్లే నగరంలో ప్రవాసాంధ్రుల ఆధ్వర్యంలో పెద్దఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి సుమంత్ ఈదర అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాలు చేతబూని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి విధ్వంస విధానాలకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. చంద్రబాబుకు మద్దతుగా తమ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా అనిల్ యార్లగడ్డ మాట్లాడుతూ తెలుగుజాతి దార్శనికుడు చంద్రబాబు. అలాంటి వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన సాగుతోంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉన్న పరిశ్రమలు తరలివెళ్తున్నాయి. త్వరలోనే ప్రజలు ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడతారు అని అన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/09/2_45c670feba-1024x576.jpg)
ఈ కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షులు బాబు కొర్రపాటి, కార్యదర్శి నిమ్మల మన్నె, సోషల్ మీడియా సమన్వయకర్త ఆనంద్ వక్కలగడ్డ తదితరులు పాల్గొన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/09/4_1c9831cf56-1024x576.jpg)