చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ కువైత్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు. ఎప్పుడో ఎదో జరిగింది అని చెబుతూ సరైన కారణాలు చూపకుండా ఒక దురుద్దేశ్యంతో జగన్ ప్రభుత్వం చంద్రబాబు ను అరెస్టు చేసి మరొకసారి సైకో బుద్దిని బయటపెట్టిందని ఆరోపించారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్షం గొంతు నొక్కే ఉద్దేశ్యంతో అలాగే లోకేష్ బాబు ప్రస్తుతం చేస్తున్న యువగళం పాదయాత్రకు ప్రజల నుండి అనూహ్యంగా మద్దత్తు వస్తుండటంలో కంగారుపడిన వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుని అక్రమంగా అరెస్టు చేసిందని అన్నారు. సైకో పోవాలి – సైకిల్ రావాలి, డౌన్ డౌన్ జగన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు.
ఈ కార్యక్రమంలో చిన్న రాజు, చామర్తి రాజు, పిడికిటి శ్రీనివాస్ చౌదరి, శ్రీకాంత్ మొదలగు, రెడ్డి మోహన్ రాచూరి, చాన్ బాష, ముస్తాక్ ఖాన్, బాలరెడ్డయ్య, నారాయణమ్మ, యెనిగళ్ళ బాలకృష్ణ, మద్దిపట్ల శివ, అర్షద్, సుధాకర రావు, వెంకట్ కోడూరి, నాగేంద్ర బాబు అక్కిలి, మద్దిన ఈశ్వర్ నాయుడు, మల్లి మారోతు, విసి సుబ్బారెడ్డి నందమూరి, నారా అభిమానులు పాల్గొన్నారు.