విక్టరీ వెంకటేష్ నటిస్తున్న తాజా చిత్రం సైంధవ్. సైలేష్ కొలను దర్శకుడు. తాజాగా వినాయక చవితి సందర్భంగా ఫ్యామిలీ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్, ఓ చిన్న పాపతో కలిసి వెంకటేష్ బీచ్ ఒడ్డున కూర్చుని నవ్వుతున్న ఫోటోను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శ్రీలంకలో జరుగుతుంది. అక్కడ భారీ యాక్షన్ సీన్స్‌తో పాటు కొంత టాకీ పార్టును కూడా చిత్రీకరించనున్నారట. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చాలా సర్‌ప్రైజ్‌లు ఉండబోతున్నాయని ఇన్ సైడ్ టాక్. ముఖ్యంగా ఈ సినిమాలో బ్లాక్ మేజిక్ కీలక పాత్ర పోషించనుందట. ఇదే కాన్సెప్ట్‌కు బలమైన డాటర్ సెంటిమెంట్‌ను జోడించి ఆసక్తికర కథగా సైలేష్ ఈ చిత్రాన్ని మలిచాడని తెలుస్తుంది. హిట్ సిరీస్‌తో థ్రిల్లర్ సినిమాలను తెరకెక్కించడంలో దిట్ట అని పేరు పొందిన సైలేష్, ఈ సినిమాతో అసలు సిసలైన థ్రిల్లర్ అంటే ఏంటో చూపించబోతున్నాడట. ముఖ్యంగా జంప్ స్కేర్ సీన్స్ పుష్కలంగా ఉండబోతున్నాయని తెలుస్తుంది. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను నిహారిక ఎంటర్‌టైనమెంట్స్ బ్యానర్ రూపొందిస్తుంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)