Namaste NRI

అయిదు రోజుల్లోగా దేశం విడిచివెళ్లిపోవాలి.. భార‌త్ వార్నింగ్ 

కెన‌డాకు చెందిన సీనియ‌ర్ దౌత్య‌వేత్త‌ను భార‌త్ బ‌హిష్క‌రించింది. అయిదు రోజుల్లోగా దేశం విడిచి వెళ్లిపోవాల‌ని వార్నింగ్ ఇచ్చింది. కెన‌డాలో ఖ‌లిస్తానీ నేత హ‌ర్దీప్ సింగ్ నిజ్జార్ ను హ‌త్య చేయించింది భార‌త్ అని ప్ర‌ధాని ట్రూడో ఆరోప‌ణ‌ల‌ను చేసిన విష‌యం తెలిసిందే. ఆ ఆరోప‌ణ‌ల‌ను భార‌త్ తీవ్రంగా ఖండించింది. ఆ ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో కెన‌డాకు చెందిన హై క‌మీష‌న‌ర్ కెమ‌రూన్ మాకేకు నోటీసులు ఇచ్చారు. దీంతో ఆయ‌న ఇవాళ ఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లో ఉన్న విదేశాం కార్యాల‌యాన్ని ఆయ‌న విజిట్ చేశారు. భార‌త్ నుంచి వెళ్లిపోవాల‌న్న దౌత్య‌వేత్త ఎవ‌ర‌న్న దానిపై క్లారిటీ లేదు. ఇండియాకు చెందిన ఏజెంట్లే, ఖ‌లిస్తానీ నేత హ‌ర్దీప్‌ను కెన‌డా నేత‌ల‌పై హ‌త్య చేసిన‌ట్లు ట్రూడో ఆరోపించారు. దీంతో రెండు దేశాల మ‌ధ్య ప్ర‌స్తుతం మాట‌ల యుద్ధం న‌డుస్తోంది. కెన‌డాలో ఉన్న భార‌తీయ దౌత్య‌వేత్త‌ను కూడా ఆ దేశం వెళ్లిపొమ్మ‌న్న‌ది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events