టాలీవుడ్ యాక్టర్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం భగవంత్ కేసరి. ఎన్బీకే 108గా వస్తున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. మేకర్స్ ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టీజర్ నెట్టింట హల్ చల్ చేస్తూ, ఫ్యాన్స్ లో జోష్ నింపుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. వినాయక చవితి పండుగ కానుకగా గణేష్ పాటకు డ్యాన్స్ చేస్తున్న పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇక ఎప్పుడు యాక్షన్ మోడ్‌లో ఉండే బాలయ్య ఇందులో భక్తి మోడ్‌లో కనిపిస్తున్నారు. ఇక దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ చిత్రాన్ని అక్టోబర్ 19న విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.