మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ఎమ్మెల్సీ కవిత చేసిన పోరాటం మరువలేనిదని బీఆర్‌ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ కో ఆర్డినేటర్ మహేష్ బిగాల అన్నారు. మహిళ రిజర్వేషన్ అమలు చేస్తామని కేంద్రం ప్రకటించడంతో ఆయన స్పందించారు. మహిళా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే మద్దతు ఇస్తామని, తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీర్మానం చేసిందని అన్నారు.
కొన్ని సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ఎమ్మెల్సీ కవిత పోరాడిన తీరు ప్రశంసనీయమన్నారు. దేశంలోని కోట్లాది మహిళల పక్షాన ఆమె ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష కూడా చేపట్టారు. ఈ బిల్లుకు మద్దతు పలకాలని దేశంలోని 49 రాజకీయ పార్టీలను కోరారు అని గుర్తు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కు ఎన్ఆర్ఐల మద్దతుకై ప్రచారాన్ని ఈ సంవత్సరం మార్చిలో ప్రారభించిన విషయాన్ని మర్చిపోవద్దన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా ప్రపంచ వ్యాప్తంగా ఎన్ఆర్ఐల మద్దతు కోసం మొదటిసారిగా ఆస్ట్రేలియాలో ప్రచారం ప్రారంభించామని, అలాగే పార్లమెంటు, అసెంబ్లీ చట్టసభల్లో 33 శాతం ఓబీసీలకు, 33 శాతం మహిళలకు రిజర్వేషన్లు అమలయ్యేలా పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించేలా చర్యలు చేపట్టాలి అని ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు.