ప్రధాని నరేంద్ర మోదీ మాట నిలబెట్టుకున్నారు. ముందే చెప్పినట్లుగా బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు ఐస్‌క్రీం తినిపించారు. విశ్వక్రీడల్లో పతకాలు సాధించిన ఒలింపిక్ పతక వీరులకు ప్రధాని మోదీ ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చారు. ఢల్లీిలోని తన నివాసానికి వారిని ప్రత్యేకంగా ఆహ్వానించిన మోదీ అథ్లెట్ల కృషిని కొనియాడారు. ఈ సందర్భంగా స్టార్ షట్లర్ పీవీ సింధుతో ఒలింపిక్స్‌కు బయల్దేరే ముందు ఇచ్చిన మాటను మోదీ నిలబెట్టుకున్నారు. ఆమెతో కలిసి ఐస్‌క్రీం తిన్న ప్రధాని.. స్వర్ణ పతక విజేత నీరజ్‌కు చుర్మా రుచి చూపించారు. తన ఇంటికి వచ్చిన క్రీడాకారులందరినీ ఆయన పేరుపేరునా పలుకరించారు.