Namaste NRI

మిషన్ 1000 ఫస్ట్ లుక్ విడుదల

తేజేశ్వర్‌ కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం మిషన్‌ 1000.  ప్రగ్య నయన్ హీరోయిన్ గా నటించింది.  సుహాసిని నిర్మాత. తెలుగు, హిందీ భాషల్లో రూపొందించిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ ఆవిష్కరించారు. వినూత్నమైన కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం, రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ఆకట్టుకుంటుంది.  కథలోని మలుపులు ఉత్కంఠను పంచుతాయి అన్నారు. ఈ సినిమాలో రాముడిపై చిత్రీకరించిన పాటను త్వరలో విడుదల చేస్తామని, రిలీజ్‌ తేదీని ప్రకటిస్తామని నిర్మాత తెలిపింది.  ప్రముఖ నిర్మాత, జాతీయ అవార్డు నిర్మాత అభిషేక్ అగర్వాల్ మా సినిమా ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందని, ఈ సందర్బంగా అభిషేక్ అగర్వాల్ కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని తేజేశ్వర్ అన్నారు. ఈ చిత్రంలో ప్రగ్య నయన్‌, కబీర్‌సింగ్‌, జయప్రకాష్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: మహేందర్‌ ఎస్‌, సంగీతం: శ్రీధర్‌ ఆత్రేయ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తేజేశ్వర్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events