అమెరికాలో నివసిస్తున్న భారతీయుల సంఖ్య ఏటికేటికి భారీగా పెరుగుతున్న ది. యూఎస్‌లో దాదాపు 47 లక్షల మంది భారతీయలు ఉన్నారని జనాభా లెక్కలు పేర్కొన్నాయి. ఈ మేరకు 2020 నాటి జాతులవారీగా సమగ్ర జనాభా లె క్కల వివరాలను అమెరికా ప్రభుత్వ పరిధిలోని యూఎస్ సెన్సస్ బ్యూరో విడుదల చేసింది. అమెరికాలో నివసిస్తున్న విదేశీయుల జనాభా : చైనా 52 లక్షలు. భారత్ 47 లక్షలు. ఫిలిప్పీన్స్ 44లక్షలు. వియత్నాం 22 లక్షలు. ఈ లెక్కల ప్రకారం అమెరికాలో నివా సం ఉంటున్న జాబితాలో 52 లక్షల మందితో చైనీయులు తొలిస్థానంలో ఉన్నారు.