Namaste NRI

ఇలా ప్రచారం చేయటం.. నీచమైన చర్య

సాయిపల్లవి  ప్రాధాన్యత ఉన్న పాత్రలే చేస్తుంది. తనపై రూమర్లు కూడా తక్కువే. వచ్చినా పట్టించుకోదు. కానీ ఇటీవల వచ్చిన ఓ రూమర్‌ ఆమెను బాగా బాధపెట్టింది. తమిళదర్శకుడు రాజ్‌కుమార్‌ పెరియస్వామితో సాయిపల్లవి ఉన్న ఫొటోను కొందరు నెటిజన్స్‌ బాగా ట్రోల్‌ చేస్తున్నారు. పూలదండలు మెడలో వేసుకొని పక్కపక్కనే నిలబడ్డ వారిద్దరి ఫొటోను పోస్ట్‌ చేసి సాయిపల్లవి పెళ్లయిపోయింది. దిగో సాక్ష్యం ఇంతకీ ఆ పెళ్లికొడుకు ఎవరో తెలుసా?’ అంటూ క్యాప్షన్లు పెట్టారు. ఈ ఫొటో, రూమర్లు చివరికి సాయిపల్లవి ఇంట్లోకి కూడా వెళ్లిపోయాయి. ఆమె తల్లిదండ్రులు కూడా ఈ రూమర్ల వల్ల మనస్తాపానికి లోనయ్యారని సాయిపల్లవి తెలిపింది. తనపై వచ్చే ఏ రూమర్నీ పట్టించుకోని సాయిపల్లవి, తొలిసారి ఈ రూమర్‌పై ట్విటర్‌ ద్వారా స్పందించింది. రూమర్లను నేను పట్టించుకోను. కానీ కుటుంబసభ్యులు, స్నేహితులు కూడా బాధపడేంత నీచంగా పుకార్లను సృష్టిస్తుంటే తప్పక స్పందిస్తున్నా. నేను నటిస్తున్న సినిమా పూజా కార్యక్రమానికి సంబంధించిన ఓ గ్రూప్‌ ఫొటోను క్రాప్‌ చేసి, దాని అర్థమే మార్చేసి, పెళ్లంటూ ప్రచారం చేయటం నీచమైన చర్య. నా సినిమా అప్‌డేట్స్‌ గురించి మాట్లాడాల్సిన సందర్భంలో ఇలాంటి నీచమైన విషయం గురించి మాట్లాడాల్సిరావడం బాధగా ఉంది అంటూ వాపోయారు సాయిపల్లవి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events