Namaste NRI

ఎన్నారై టీడీపీ టాంపా ఆధ్వర్యంలో.. బాబుతో నేను

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి  చంద్రబాబు అక్రమ అరెస్టును వ్యతిరేకంగా  బాబుతో నేను అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది టీడీపీ. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని టాంపా నగరంలో ఎన్నారై టీడీపీ టాంపా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నారై టీడీపీ టాంపా ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ప్రదర్శనకు పెద్ద ఎత్తున యువకులు, టీడీపీ సానుభూతిపరులు, ఐటీ ఉద్యోగులు తరలి వచ్చారు. ప్లకార్డుల ప్రదర్శనతో ఈ కార్యక్రమం సాఫీగా సాగింది.  చంద్రబాబు చేసిన తప్పు ఏంటి? అంటూ సందేశంతో కూడిన ప్లకార్డులు ప్రదర్శించారు. నైపుణ్య శిక్షణ కేంద్రాలతో మన బిడ్డలకు ఉద్యోగాలు కల్పించడం నేరమా? అని ప్రశ్నించారు. కుటుంబం కన్నా ప్రజలే ముఖ్యం అంటూ పగలు, రాత్రి కష్టపడటం తప్పా? ప్రజా సమస్యలు కోసం రోడ్డెక్కి ప్రభుత్వాన్ని నిలదీయడం అపరాధమా? అవినీతిపై జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం పాపమా? రాజకీయ కక్షతో చంద్రబాబు గారిపై పెట్టిన కేసును ఖండిద్దాం అంటూ నినాదించారు.

తప్పుడు కేసులపై గళమెత్తుదాం.. జగన్ కుట్రను ఎండగడదాం, బాబుతో నేను అని చాటి చెపుదాం అని రాసి ఉన్న ప్లకార్డులు చేతబట్టారు.  ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు చంద్రబాబు మద్దతుదారులు, ఎన్నారై టీడీపీ టాంపా కమిటీ సభ్యుల బృందాన్ని మనస్పూర్తిగా అభినందించారు. ఎన్నారై టీడీపీ టాంపా కమిటీ ముందు నిలబడి దీనిని విజయవంతం చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events