సమరసింహారెడ్డి, అక్సా ఖాన్ జంటగా శ్రీను దర్శకత్వంలో నారాయణస్వామి నిర్మించే చిత్రం మగ పులి. ఫార్మర్ ఈజ్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ వరల్డ్ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి నటుడు సుమన్ క్లాప్ ఇవ్వగా, రైతు టి.రంగడు కెమెరా స్విచాన్ చేశారు. సినిమా విజయం సాధించాలని వారు ఆకాంక్షించారు. దర్శకుడు మాట్లాడుతూ మనదేశంలో నిరుద్యోగం, రైతు సమస్యలు ఎక్కువ. నిరుద్యోగులు, రైతులు, రాజకీయ నాయకులు, డ్రైవర్స్.. వీరి చుట్టూ ఈ చిత్రకథ ఉంటుంది. సుమన్, బాహుబలి ప్రభాకర్, రఘుబాబు, సుధ వంటి సీనియర్ తారలు నటిస్తున్నారు. అక్టోబర్ మొదటి వారంలో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టి మూడు షెడ్యూల్స్‌తో పూర్తి చేస్తాం అని చెప్పారు. సమరసింహారెడ్డి మాట్లాడుతూ నేను తెలుగు వాడినైనా ఆంధ్రా, కర్ణాటక బోర్డర్లో ఉండడం వల్ల కన్నడంలో నటించాను. ఇప్పుడు నా మాతృభాషలో నటిస్తున్నందుకు ఆనందంగా ఉంది అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: భానుప్రసాద్.జె, కెమెరా: శివారెడ్డి ఎస్వీ.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)