భవిష్యత్తులో కొవిడ్-19 కన్నా భయంకరమైన మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముడుతుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. స్పానిష్ ఫ్లూతో కోట్లాది మంది చనిపోయినట్టే, ఈ కొత్త వైరస్ కారణంగా కనీసం 5 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్నదని బ్రిటన్ వ్యాక్సిన్ టాస్క్‌ఫోర్స్‌కు నేతృత్వం వహించిన సైంటిస్టు కేట్ బ్రిఘం హెచ్చరించారు. జంతువుల్లో వైరస్ విస్తరిస్తుందని, మ్యుటేషన్లు ఏర్పడి మానవాళికి పెద్ద సవాల్‌గా మారుతుందని తాను రాసిన ఓ పుస్తకంలో బ్రిఘం వివరించారు. ఈ పుస్తకానికి వ్యాక్సిన్ నిపుణుడు టిమ్ హ్యామ్స్ సహ రచయితగా ఉన్నారు. వేలాది రకాల వైరస్‌ల నుంచి మహమ్మారి ప్రబలేందుకు అవకాశముంది. ఇందులో 25 వైరస్ కుటుంబాలను సైంటిస్టులు గుర్తించారు. ప్రతి కుటుంబంలో వేలాది రకాల వైరస్‌లుంటాయి. దీంట్లో ఏదో ఒక వైరస్ వల్ల మహమ్మారి ప్రబలే అవకాశముంది అని టిమ్ హ్యామ్స్, బ్రిఘం తెలిపారు.