Namaste NRI

అక్టోబర్‌లో అతిపెద్ద హిందూ దేవాలయం ప్రారంభం

అమెరికాలో అతిపెద్ద హిందూ దేవాలయాన్ని నిర్మించారు. న్యూజెర్సీ రాష్ట్రంలోని రాబిన్స్‌విల్లేలో ఈ అద్భుత ఆలయ నిర్మాణం జరిగింది. ఈ ఆలయాన్ని స్వామినారాయణ్‌ అక్షర్‌ధామ్‌గా పిలుస్తున్నారు. 19వ శతాబ్దం నాటి ఆధ్మాత్మిక గురువు భగవాన్‌ స్వామి నారాయణ్‌కు ఈ అద్వితీయమైన ఆలయాన్ని అంకితమిస్తున్నట్లు ఆలయ నిర్మాణకర్తలు తెలిపారు. మొత్తం 183 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. వేల ఏళ్ల క్రితమే శిథిలమైన ఆలయం స్థానంలో ఈ ఆలయ పునర్నిర్మాణం చేశారు. ఈ భారీ ఆలయ నిర్మాణం కోసం ఉత్తర అమెరికా నలు మూలల నుంచి 12,500 మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. దేశంలోని ఇతర అక్షర్‌ధామ్‌ ఆలయాల మాదిరిగానే ఈ ఆలయాన్ని కూడా డిజైన్‌ చేశారు. ఈ ఆలయ నిర్మాణానికి 12 సంవత్సరాల సుదీర్ఘ సమయం పట్టింది. ఆలయంలో 10 వేలకు పైగా విగ్రహాలు ఉన్నాయి. భారతీయ సంగీత పరికరాలు, నృత్య రీతులకు సంబంధించిన శిల్పాలు ఉన్నాయి. నిర్మాణ పనులు పూర్తి చేసుకున్న ఈ ఆలయాన్ని అక్టోబర్‌ 8న అధికారికంగా ప్రారంభించనున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events