బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా,ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాలు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరి వివాహం రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్పూర్లోని లీలా ప్యాలెస్లో పంజాబీ సంప్రదాయం ప్రకారం ఆదివారం అంరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకలో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్, ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరంలతో పాటు బంధుమిత్రులు, స్నేహితులు, ఆప్ ముఖ్య నేతలు హాజరయ్యారు.ఈ పెళ్లి ఫొటోలను కొత్త జంట సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన అభిమానులు రాఘవ్ – పరిణీతికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.