Namaste NRI

పేరెలా ఉన్నా సమాజానికి మంచి సందేశం ఇచ్చే సినిమా

శాంతిచంద్ర కథానాయకుడిగా ఆడారి మూర్తిసాయి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం డర్టీ ఫెలో. దీపిక్‌ సింగ్‌, సిమ్రితి కథానాయికలు. జి.యస్‌.బాబు నిర్మాత.  చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించింది. ప్రముఖ కథానాయకుడు శ్రీకాంత్‌ ముఖ్య అతిథిగా హాజరై టీజర్‌ని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు, గురువులు పిల్లల్ని క్రమశిక్షణతో పెంచకపోతే  ఆ పిల్లలు ఎలా తయారవుతారో చెబుతూ ఈ సినిమా తీశారు దర్శకుడు. ఆ కాన్సెప్ట్‌ నాకు బాగా నచ్చింది అన్నారు. కథానాయకుడు మాట్లాడుతూ పేరెలా ఉన్నా సమాజానికి మంచి సందేశం  ఇచ్చేలా ఈ సినిమా ఉంటుంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు సతీశ్‌కుమార్‌, దర్శకుడు వీరశంకర్‌తో పాటు చిత్రబృందం పాల్గొంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress